పాక్‌ క్రూరం.. భారత జవాను దేహం ముక్కలు | 3 soldiers killed in an encounter with terrorists | Sakshi
Sakshi News home page

పాక్‌ క్రూరం.. భారత జవాను దేహం ముక్కలు

Nov 22 2016 5:02 PM | Updated on Sep 4 2017 8:49 PM

పాక్‌ క్రూరం.. భారత జవాను దేహం ముక్కలు

పాక్‌ క్రూరం.. భారత జవాను దేహం ముక్కలు

పాకిస్థాన్‌ ఉగ్రవాదులు క్రూర చర్యకు దిగారు. భారత జవాను చంపేసి శరీరాన్ని ముక్కలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి జరుగుతున్న పరస్పర దాడి నేపథ్యంలో ఈ అమానుషం చోటు చేసుకుంది.

జమ్మూకశ్మీర్‌: పాకిస్థాన్‌ ఉగ్రవాదులు క్రూర చర్యకు దిగారు. భారత జవాను చంపేసి శరీరాన్ని ముక్కలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి జరుగుతున్న పరస్పర దాడి నేపథ్యంలో ఈ అమానుషం చోటు చేసుకుంది. వాస్తవాదీన రేఖ వద్ద కొన్ని గంటలుగా భారత జవాన్లకు పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరుగుతోంది. భారత ఆర్మీ ధీటుగానే స్సందిస్తోంది.

అయితే, ఈ కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో ఒకరి శరీరాన్ని ఉగ్రవాదులు క్రూరంగా ముక్కలు చేసి పడేశారు. మచ్చల్‌ సెక్టార్‌ లో ఈ దారుణం చోటు చేసుకుంది. భారత ఆర్మీ పాక్‌ ఆక్రమిత భూభాగంలోకి వెళ్లి సర్జికల్‌ దాడులు నిర్వహించిన తర్వాత పాక్‌ ఉగ్రవాదులు చేతిలో ఎదురు దెబ్బ తగలడం ఇదే తొలిసారి. ఇప్పటికే జవాన్లను కలిసిన రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఆదేశాలు ఇచ్చి వచ్చిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం పాక్‌ ఉగ్రవాదుల రెచ్చగొట్టే చర్యలను ప్రతిబింబిస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement