ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు.. మహిళతో సహా నలుగురి అరెస్ట్‌ | Woman Among Four Arrested Over Anti Terror Operation In Srinagar Hazratbal, Weapons And Cash Seized | Sakshi
Sakshi News home page

ఉగ్ర నెట్‌వర్క్ గుట్టురట్టు.. మహిళతో సహా నలుగురి అరెస్ట్‌

Apr 23 2026 11:19 AM | Updated on Apr 23 2026 11:43 AM

Four Ogws Arrested In Srinagar Hazratbal

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని హజరత్‌బల్‌లో ఉగ్ర వాదులకు ఆశ్రయం ఇచ్చిన నలుగురిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిలో ఓ మహిళను కూడా అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి ఒక గ్రనేడ్‌, ఏకే-47 తూటాలు, నగదు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

హజ్రత్‌బాల్‌కు చెందిన జహూర్ అహ్మద్ మీర్, బషీర్ అహ్మద్ భట్, గులాం మహమ్మద్ భట్, అదే ప్రాంతానికి చెందిన షాజియా మహమ్మద్ అనే మహిళను నిందితులుగా గుర్తించారు. వీళ్లంతా స్థానికంగా ఉగ్రవాదులకు రహస్య స్థావరాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఉగ్రవాదులకు రవాణా, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నారని, భద్రతా దళాల కదలికలపై సమాచారాన్ని అందిస్తున్నట్లు విచారణలో తేలింది.

ముందస్తు సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అరెస్టయిన నిందితులు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. అహ్మద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో FIR నెం. 20/2026 కింద చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), ఆర్మ్స్ యాక్ట్ (ఆయుధ చట్టం)లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదుచేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement