మానవ మృగానికి మరణ దండన | 19-year-old gets death penalty | Sakshi
Sakshi News home page

మానవ మృగానికి మరణ దండన

Jul 22 2018 3:18 AM | Updated on Jul 23 2018 8:51 PM

19-year-old gets death penalty - Sakshi

జైపూర్‌: ఏడు నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పింటూ(19) అనే యువకుడికి రాజస్తాన్‌లోని అళ్వార్‌ జిల్లా కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో ఈ ఏడాది మే 9న ఏడు నెలల వయసున్న బాలికను పింటూ రేప్‌ చేశాడు. దీంతో పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్టుచేశారు. కేసును విచారించిన ప్రత్యేక జడ్జి జగేంద్ర అగర్వాల్‌.. పింటూను జూలై 18న దోషిగా నిర్ధారించారు. అనంతరం ఐపీసీ 363, 336ఏ, 376ఏబీ, పోక్సో చట్టం కింద దోషికి శనివారం మరణశిక్ష విధించారు. 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగికదాడికి పాల్పడే నేరస్తులకు మరణదండన విధించేలా నేరచట్టాన్ని సవరిస్తూ రాజస్తాన్‌ సర్కారు ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక రాజస్తాన్‌లో తొలిసారి సెక్షన్‌ 376ఏబీ కింద దోషికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement