చిరుతో ‘మైత్రీ’ | Will Chiranjeevi Act In Mythri Movie Makers Banner | Sakshi
Sakshi News home page

చిరుతో ‘మైత్రీ’

Apr 15 2018 12:32 PM | Updated on Apr 15 2018 12:32 PM

Will Chiranjeevi Act In Mythri Movie Makers Banner - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్‌ రెడ్డి  దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సై రా షూటింగ్ పూర్తి కాకముందే చిరు తదుపరి సినిమాపై చర్చ జరుగుతోంది. చిరు తరువాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఉండబోతోందన్న వార్త ఫిలిం నగర్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. 

రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన ఈ సంస్థ చిరుతో సినిమా చేయడానికి రెడీ అవుతోందట. రంగస్థలం షూటింగ్‌ సమయంలోనే చిరును సంప్రదించారని, ఈ సినిమాను కూడా సుకుమార్‌ దర్శకత్వంలోనే తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్‌ చెప్పిన కథ చిరుకు బాగా నచ్చడంతో ఓకే కూడా చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement