సల్మాన్‌కు అతిథిగా.. | Varun Dhawan to have guest appearance in Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్‌కు అతిథిగా..

Oct 4 2018 1:26 AM | Updated on Oct 4 2018 1:26 AM

Varun Dhawan to have guest appearance in Salman Khan - Sakshi

వరుణ్‌ ధావన్‌

‘నా సినిమాకి నువ్వు.. నీ సినిమాకి నేను’ అతిథులం అన్నట్లు ఉంది సల్మాన్‌ ఖాన్, వరుణ్‌ ధావన్‌ల వైఖరి. గతేడాది వరుణ్‌ ధావన్‌ నటించిన ‘జుద్వా 2’ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ గెస్ట్‌ రోల్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. 1997లో సల్మాన్‌ఖాన్‌ హీరోగా చేసిన ‘జుద్వా’ సినిమాకు ‘జుద్వా 2’ సీక్వెల్‌ అని తెలిసిందే. ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న ‘భారత్‌’ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేయడానికి వరుణ్‌ ధావన్‌ అబుదాబీ వెళ్లారని బాలీవుడ్‌ టాక్‌. అంటే వరుణ్, సల్మాన్‌కు బదులు తీర్చుతున్నారన్నమాట.

ఈ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినా కైఫ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్, టబు, సునీల్‌ గ్రోవర్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. కొరియన్‌ మూవీ ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కి ‘భారత్‌’ రీమేక్‌. ఈ సినిమా మూడో షెడ్యూల్‌ అబుదాబీలో జరుగుతోంది. మరి.. వరుణ్‌ ధావన్‌ అతిథి పాత్రలో కనిపించేది పాటలోనా? లేక సీన్‌లోనా? అన్న విషయాన్ని మాత్రం టీమ్‌ బయట పెట్టడం లేదు. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్స్‌ ఢిల్లీ, పంజాబ్‌లో జరగనున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement