పనులు ప్రారంభం | Tamil Nadu government to allow post-production of films | Sakshi
Sakshi News home page

పనులు ప్రారంభం

May 12 2020 5:56 AM | Updated on May 12 2020 5:56 AM

Tamil Nadu government to allow post-production of films - Sakshi

ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ రంగాలకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలకు తమిళనాడు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం నుంచి తమిళ సినిమాల పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇండియన్‌ 2’కు సినిమాకు సంబంధించిన ఎడిటింగ్‌ వర్క్స్‌ చెన్నైలోని రెండు వేరువేరు స్టూడియోల్లో ప్రారంభమయ్యాయట. ఇంకా విశాల్‌ హీరోగా నటించిన ‘చక్ర’ డబ్బింగ్‌ వర్క్స్, త్రిష నటించిన లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ ‘రాంగీ’ గ్రాఫిక్స్‌ పనులు కూడా స్టార్ట్‌ అయ్యాయి. అలాగే తమ సినిమాల పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను ప్రారంభించేందుకు పలు నిర్మాణ సంస్థలు సన్నాహాలు మొదలుపెట్టాయి.

Advertisement
 
Advertisement
Advertisement