సుమంత్‌ ‘సుబ్రహ్మణ్యపురం’ ప్రారంభం | Sumanth New Movie Subrahmanyapuram Is Started | Sakshi
Sakshi News home page

సుమంత్‌ ‘సుబ్రహ్మణ్యపురం’ ప్రారంభం

Mar 18 2018 1:13 PM | Updated on Aug 29 2018 5:43 PM

Sumanth New Movie Subrahmanyapuram Is Started - Sakshi

‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా తొలిషాట్‌కు క్లాప్‌ కొడుతున్న నాగచైతన్య

సరైన హిట్‌లేక సతమతమవుతున్న సుమంత్‌ కెరీర్‌ మళ్ళీరావా సినిమాతో ఊపందుకుంది. ఇలాంటి క్లాస్‌హిట్‌ తర్వాత సుమంత్‌ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. మళ్ళీరావా ఇచ్చిన ఊపుతో వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు సుమంత్‌. అయితే తాజాగా మరో ప్రాజెక్టును ప్రారంభించాడు.

సుబ్రహ్మణ్యపురం పేరుతో రూపొందుతున్న సినిమాను ఉగాది సందర్భంగా ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై తొలిషాట్‌కు క్లాప్ కొట‍్టారు. లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఈషారెబ్బాను హీరోయిన్‌గా నటిస్తోంది. సంతోశ్‌ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ధీరజ్‌ భోగారం, సుదాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement