ట్రైలర్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యాను | sukumar launches anthaku minchi movie trailer | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ చూసి ఇంప్రెస్‌ అయ్యాను

Jul 9 2018 1:17 AM | Updated on Jul 9 2018 1:19 AM

sukumar launches anthaku minchi movie trailer - Sakshi

జై, సుకుమార్‌

జై, రష్మి జంటగా ఎస్‌.జై. ఫిలింస్‌ పతాకంపై జానీ దర్శకత్వంలో సతీష్‌ గాజుల, ఎ. పద్మనాభరెడ్డి నిర్మించిన చిత్రం ‘అంతకుమించి’. భాను ప్రకాశ్, కన్నా సహ నిర్మాతలు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ –‘‘ట్రైలర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నన్ను ఇంప్రెస్‌ చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది.

సినిమా విజయం సాధించాలి’’అన్నారు. ‘‘అడగ్గానే మా చిత్రం ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన సుకుమార్‌గారికి థ్యాంక్స్‌. సెన్సార్‌ అవ్వగానే రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ‘‘నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన సుకుమార్‌గారికి థ్యాంక్స్‌. జై, రష్మిలకు గుర్తుండిపోయే చిత్రమిది’’ అన్నారు జానీ. ‘‘మధ్యతరగతి కుర్రాడి పాత్రలో నటించాను’’ అన్నారు జై.

Advertisement
 
Advertisement
Advertisement