సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ | Sukumar is teaming up with Jr.NTR for his next film. | Sakshi
Sakshi News home page

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్

Aug 5 2013 1:14 AM | Updated on Sep 1 2017 9:38 PM

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్

సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్

ఎన్టీఆర్ తన కెరీర్‌లో వేగం పెంచారు. వరుసపెట్టి సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు.

ఎన్టీఆర్ తన కెరీర్‌లో వేగం పెంచారు. వరుసపెట్టి సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సెప్టెంబరులో ఆ చిత్రం విడుదల కానుంది. ఇక మరో పక్క ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. 
 
 ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఇప్పుడు సుకుమార్ సినిమా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సుకుమార్ చెప్పిన కథ ఎన్టీఆర్‌కి విపరీతంగా నచ్చేసిందట. చాలా కొత్త కాన్సెప్ట్‌తో ఉన్న ఆ మూవీని చేయడానికి వెంటనే ఎన్టీఆర్ ఓకే చెప్పేశారు.
 
 కొత్త కాన్సెప్ట్‌తో హీరో కారెక్టరైజేషన్‌ని డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తూ స్టయిలిష్‌గా సినిమాలు తీస్తాడని పేరున్న సుకుమార్, ఎన్టీఆర్ ఇమేజ్‌కి నప్పే విధంగా స్క్రిప్టుని చేసుకున్నారట. ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబు. ‘1-నేనొక్కడినే’ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తిగానే ఎన్టీఆర్ చిత్రం మొదలవుతుంది. బివీఎస్‌ఎస్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత.

Advertisement
 
Advertisement
Advertisement