నలుగురు హీరోలతో మల్టీ స్టారర్ | Sandeep Kishan, Sudeer babu, Aadi, Nara Rohit Multi Starer | Sakshi
Sakshi News home page

నలుగురు హీరోలతో మల్టీ స్టారర్

Feb 5 2017 12:38 PM | Updated on Sep 15 2019 12:38 PM

నలుగురు హీరోలతో మల్టీ స్టారర్ - Sakshi

నలుగురు హీరోలతో మల్టీ స్టారర్

టాలీవుడ్ యంగ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో మరో యూత్ మల్టీ స్టారర్కు రంగం

టాలీవుడ్ యంగ్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసి పనిచేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో మరో యూత్ మల్టీ స్టారర్కు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా నలుగురు యంగ్ హీరోలు కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే మల్టీ స్టారర్ సినిమాలు చేసిన సందీప్ కిషన్, నారా రోహిత్ తో పాటు సుదీర్ బాబు, ఆదిలు కలిసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారు.

విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నారా రోహిత్.. బాలీవుడ్ లో విలన్ గా కూడా చేసొచ్చిన సుధీర్ బాబు.. తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న సందీప్ కిషన్.. మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న సాయి కుమార్ కొడుకు ఆది. ఈ నలుగురు ఇప్పుడు ఒక సినిమాకు సైన్ చేశారట.

సుదీర్ బాబు హీరోగా భలే మంచి రోజు సినిమాను తెరకెక్కించిన శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ సంస్థ ఈ నలుగురు హీరోల మల్టీ స్టారర్ను రూపొందిస్తుంది. ఇప్పటికే ఈ భారీ మల్టీ స్టారర్లో నటించేందుకు నలుగురు హీరోలు ఒకే చెప్పేశారు. మార్చిలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement