వెయ్యి సార్లు ఫోన్‌ చేసింది! | Priyanka Chopra 'Called Up Arpita Thousand Times' Asking For bharath | Sakshi
Sakshi News home page

వెయ్యి సార్లు ఫోన్‌ చేసింది!

Sep 9 2018 2:46 AM | Updated on Sep 9 2018 2:46 AM

Priyanka Chopra 'Called Up Arpita Thousand Times' Asking For bharath - Sakshi

సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంకా చోప్రా

పార్టీకి వెళ్లినా, ఈవెంట్‌కి వెళ్లినా, సినిమా ప్రమోషన్‌కి పోయినా సల్మాన్‌ ఖాన్‌ను మాత్రం ఓ ప్రశ్న వెంటాడుతూనే ఉంది. మీ ‘భారత్‌’ సినిమా నుంచి ప్రియాంకా చోప్రా ఎందుకు తప్పుకున్నారు? అని. నిన్న మొన్నటి వరకు పెళ్లి కోసం ప్రియాంకా చోప్రా తప్పుకున్నారని సల్మాన్‌ కూడా మాట దాట వేశారు. రీసెంట్‌గా గోవాలో జరిగిన ‘బిగ్‌ బాస్‌ 12’ ఈవెంట్‌ లాంచ్‌లో మాత్రం అసలు విషయం చెప్పేశారు. ‘‘నిజానికి ‘భారత్‌’ సినిమాకు హీరోయిన్‌గా నిర్మాత అతుల్‌ అగ్నిహోత్రి ముందుగా కత్రినా కైఫ్‌ను తీసుకుందాం అన్నారు. కానీ ఆ టైమ్‌లోనే ప్రియాంకా చోప్రా నా సిస్టర్‌ ఆర్పితా ఖాన్‌కు సుమారు వెయ్యిసార్లు ఫోన్‌ చేసింది. ‘భారత్‌’ ప్రాజెక్ట్‌పై ఇంట్రస్ట్‌గా ఉన్నాను.

సల్మాన్‌ ఖాన్‌తో వర్క్‌ చేయాలనుకుంటానని చెప్పింది. అంతేకాదు దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌కి కూడా కాల్‌ చేసింది.  ప్రియాంకను తీసుకోవడానికి అది కూడా ఓ కారణమే. సడన్‌గా ఓ రోజు ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నానని చెప్పింది. పెళ్లి కోసమే అయితే షూటింగ్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకోమని చెప్పాను. కానీ ప్రాజెక్ట్‌లో నేను కొనసాగను అని ప్రియాంకా తేల్చి చెప్పింది. ఎందుకలా చేసిందో అడగలేదు. ‘సరే నీ ఇష్టం.. ఆల్‌ ది బెస్ట్‌’ అని చెప్పాం.

ఆమెకు బాలీవుడ్‌లో సినిమాలు చేయడం ఇష్టం లేదునుకుంటాను. ఇప్పుడు కత్రినా కైఫ్‌ మా ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. ‘భారత్‌’ బాగానే సాగుతోంది’’ అని చెప్పుకొచ్చారు సల్మాన్‌. అదండీ సంగతి. ఇందులో కత్రినా కైఫ్‌తో పాటు దిశా పాట్నీ కథానాయికలుగా నటిస్తున్నారు. రీసెంట్‌గా మాల్తా షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రియాంక ‘ద స్కై ఈజ్‌ పింక్‌’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త విరామం దొరకడంతో ప్రస్తుతం కాబోయే భర్త నిక్‌ జోనాస్‌తో హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement