అందరికీ చేరువయ్యేలా ఉంది | Malli Malli Chusa Song Launch By VV Vinayak | Sakshi
Sakshi News home page

అందరికీ చేరువయ్యేలా ఉంది

Feb 1 2019 2:08 AM | Updated on Feb 1 2019 2:08 AM

Malli Malli Chusa Song Launch By VV Vinayak - Sakshi

వినాయక్‌, అనురాగ్‌ కొణిదెన

‘‘మళ్లీ మళ్లీ చూశా’ చిత్రంలోని ‘చినుకే నాకె చూపె...’ పాట వినసొంపుగా ఉంది. ట్రైలర్‌ కూడా అందంగా, అందరికీ చేరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్‌ లుక్, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగున్నాయి. ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా మంచి విజయం సాధించాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ అన్నారు. అనురాగ్‌ కొణిదెన హీరోగా, శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా సాయిదేవ రామన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై కొణిదెన కోటేశ్వరరావు నిర్మించారు.

శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చినుకే నాకె చూపె...’ పాటను  వినాయక్‌ విడుదల చేశారు. సాయిదేవ రామన్‌ మాట్లాడుతూ– ‘‘ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. శ్రవణ్‌ సంగీతం, సతీష్‌ ముత్యాల కెమెరా ఆకర్షణగా నిలుస్తాయి. పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రం మా ‘మళ్లీ మళ్లీ చూశా’’ అన్నారు కోటేశ్వరరావు. ‘మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమకథ ఇది’’  అన్నారు అనురాగ్‌. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సాయి సతీష్‌ పాలకుర్తి మాట్లాడారు.
∙వీవీ వినాయక్, అనురాగ్‌

Advertisement
 
Advertisement
Advertisement