పదేళ్ల తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్‌తో మహేష్‌ సినిమా!

Mahesh babu Likely Work With Trivikram After Ten Years - Sakshi

ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో సెలబ్రిటీలంతా ఇళ్లలోనే ఉంటూ కొత్త ప్రాజెక్టులపై కసరత్తు ప్రారంభించారు. షూటింగ్‌లో ఉన్న సినిమాలు నిలిచిపోవడంతో భవిష్యత్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ హీరో, ఏ డైరెక్టర్‌తో ఏ సినిమా చేయనున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో పదేళ్ల క్రితం ఖలేజా సినిమా విడుదలయ్యింది. 2010లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అప్పటి నుంచి వీరిద్దరు కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. కాగా గతేడాది మాత్రం ఇద్దరు ఓ ప్రకటన కోసం కలిసి పనిచేశారు. (యూట్యూబ్‌ ఛానల్‌ ఆదాయమంతా దానికే: రకుల్‌ )


అయితే త్రివిక్రమ్‌, మహేష్‌ మరోసారి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్‌ టాక్‌. అంతా సవ్యంగా జరిగితే జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్‌.. సూపర్‌స్టార్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల మహేష్‌ నటించిన ‘సరిలేరు నీకెవ్వరరు’, త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అల వైకుంఠపురములో’ రెండూ బిగ్గెస్ట్‌ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తమ నెక్స్ట్‌ ప్రాజెక్టుపై కుస్తీ పడుతున్నారు. ఓ వైపు మహేష్‌ పరుశురామ్‌ దర్శకత్వంలో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. (అకీరా బర్త్‌డే.. చిరు ఆకాంక్ష అదే! )

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top