అకీరా బర్త్‌డే.. చిరు ఆకాంక్ష అదే! | Chiranjeevi Birthday Wishes To Akira Nandan Tweet Viral | Sakshi
Sakshi News home page

అకీరా బర్త్‌డే.. చిరు ట్వీట్‌ వైరల్‌

Apr 8 2020 12:49 PM | Updated on Apr 8 2020 12:49 PM

Chiranjeevi Birthday Wishes To Akira Nandan Tweet Viral - Sakshi

మెగాఫ్యామిలీ అభిమానులకు ఈ రోజు డబుల్‌ ధమాకా. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, లిటిల్‌ పవర్‌స్టార్‌ అకీరా నందన్‌ల పుట్టిన రోజు కావడంతో సోషల్‌ మీడియాలో విషెస్‌ల మోత మోగిపోతుంది. వీర్దిదరికి ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. కాగా, మెగాస్టార్‌ చిరంజీవి బన్ని, అకీరాలకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ముఖ్యంగా అకీరాకు చిరు బర్త్‌డే విషెస్‌ తెలపడం పట్ల అటు​ మెగాస్టార్‌, ఇటు పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ మురిపిపోతున్నారు.   

‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే  మించిపోవాలి. విష్ యూ ఏ పవర్ ఫుల్ ప్యూచర్. హ్యాపీ బర్త్ డే అకీరా’అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా అకీరాను ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. చిరంజీవితో పాటు మెగా కుటుంబసభ్యులు, మెగా ఫ్యాన్స్‌ కూడా అకీరాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మొదటి సంతానమే అకీరా నందన్. పవన్ కల్యాణ్ తర్వాత వారసుడు అతడే అంటూ ఫ్యాన్స్‌ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. ఇక పవన్‌, రేణులు విడిపోయినప్పటికీ తన తండ్రిని చూడటానికి అకీరా అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తుంటాడు. అంతేకాకుండా పెద్దనాన చిరంజీవి ఫ్యామిలీతో కూడా ఈ లిటిల్‌ పవర్‌స్టార్‌కు మంచి బాండింగ్‌ ఉంది. 16ఏళ్ల అకీరా ఇప్పటికే మలయాళం చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. 

చదవండి:
ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి
పెద్దాయన సన్‌ గ్లాసెస్‌ వెతకండ్రా

Advertisement
 
Advertisement
Advertisement