అందరికీ ఆ చాన్స్‌ రాదు | Ayushmann-Radhika Apte talk AndhaDhun | Sakshi
Sakshi News home page

అందరికీ ఆ చాన్స్‌ రాదు

Oct 2 2018 2:26 AM | Updated on Apr 3 2019 6:34 PM

 Ayushmann-Radhika Apte talk AndhaDhun - Sakshi

రాధికా ఆప్టే

కేవలం వెండితెరపై మాత్రమే కాదు డిజిటల్‌ సెక్టార్‌లోనూ ఆఫర్లను కొల్లగొడుతూ కెరీర్‌లో మంచి హైప్‌లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ‘లస్ట్‌స్టోరీస్, సాక్రెడ్‌ గేమ్స్, ఘోల్‌’ వంటి వెబ్‌ బేస్డ్‌ మరియు టీవీ షోస్‌లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారామె. ఈ అనుభవం ఎలా ఉంది? అన్న ప్రశ్నను రాధిక ముందుంచితే...‘‘డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెక్టార్‌లో నేనింకా సంతృప్తిగా లేను. ఎందుకంటే ‘లస్ట్‌ స్టోరీస్‌’ సిరీస్‌లో ఒక పార్ట్‌లో మాత్రమే ఉన్నాను. ఇక ‘సాక్రెడ్‌ గేమ్స్‌’లో చిన్న పాత్ర చేశా. ‘ఘోల్‌’లో మాత్రమే మెయిన్‌ లీడ్‌గా చేశాను.

కానీ వీటన్నింటిలో నటించడం కొత్త అనుభూతిని ఇస్తోంది. ముందు ముందు ఇంకా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను అన్నారు’’. ఈ భామ హాలీవుడ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో మైఖేల్‌ వింటర్‌ బోటమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా (‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ పరిశీలనలో ఉన్న టైటిల్‌) చేస్తోన్న సంగతి తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ– ‘‘ఆసియాలోని కొందరి హీరోయిన్స్‌కు మాత్రమే నాన్‌–ఇండియన్‌ సినిమాల్లో నటించే చాన్స్‌ వస్తుంది. ఆ చాన్స్‌ నాకొచ్చినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు రాధికా ఆప్టే. ‘రక్తచరిత్ర, లెజెండ్, లయన్‌’ వంటి తెలుగు సినిమాల్లో రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘అంథా ధూన్, బజార్‌’ ఈనెల 5, 26 తేదీల్లో విడుదల కానున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement