‘అడ‌ల్ట్ సీన్లు ఉంటే ఆ సినిమాలో న‌టించ‌ను’

Abhishek Bachchan Lost Roles by No Intimate Scene Policy For Aaradhya - Sakshi

బాలీవుడ్ హీరో అభిషేక్ బ‌చ్చ‌న్ తండ్ర‌య్యాక సినిమాల ఎంపిక‌లో ఆచితూచి అడుగులేస్తున్నాడు‌. సినిమాకు సైన్ చేసేముందు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కండిష‌న్స్ కూడా పెడుతున్నాడు. ఈ విష‌యాన్ని అత‌నే స్వ‌యంగా వెల్ల‌డించాడు. అత‌డు తొలిసారిగా న‌టించిన వెబ్ సిరీస్‌ "బ్రీత్: ఇంటు ద షాడోస్"‌ చిత్రం విడుద‌ల‌ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఎనిమిదేళ్ల‌ కూతురు ఆరాధ్య‌ త‌న‌ను ఎంత‌గానో మార్చివేసిందంటున్నాడు. "రొమాంటిక్‌ స‌న్నివేశా‌ల్లో న‌టించడానికి నేను ఇబ్బందిప‌డుతున్నాను. ఎందుకంటే అలాంటి సీన్ల‌లో న‌న్ను చూసేందుకు నా కూతురు ఇబ్బందిప‌డ‌టం ఇష్టం లేదు. (ఏంటా సర్‌ప్రైజ్‌ ? ఐష్‌ మళ్లీ తల్లి కాబోతున్నారా?)

వాటి గురించి తాను అడిగే ప్ర‌శ్న‌ల‌కు నేను స‌మాధానం చెప్ప‌లేను. కాబ‌ట్టి ఏదైనా సినిమా ఒప్పుకునేముందు అందులో శారీర‌క సంబంధం, రొమాంటిక్ సీన్లు ఎక్కువ‌గా ఉన్నాయని తెలిస్తే ముందే ఆ చిత్రం నుంచి త‌ప్పుకుంటాను. అలా ఎన్నో సినిమాలు వ‌దులుకున్నాను. కానీ దీని గురించి ఎప్పుడూ బాధ‌ప‌డలేదు" అని తెలిపాడు. కాగా అభిషేక్ న‌టించిన‌ లూడో, బాబ్ బిస్వాస్‌, ద బిగ్ బుల్ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధంగా ఉండ‌గా మ‌రో నాలుగు ప్రాజెక్టులకు సైన్ చేశాడు. (‘పెట్రో’ మంట; వైర‌ల‌వుతున్న బిగ్‌బీ ట్వీట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top