ఏంటా సర్‌ప్రైజ్‌ ? ఐష్‌ మళ్లీ తల్లి కాబోతున్నారా?

Abhishek Bachchan Surprise Tweet Is Aishwarya Rai Pregnant? - Sakshi

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ తన ఫ్యాన్స్‌ను తీవ్ర గందరగోళంలో పడేశారు. సర్‌ప్రైజ్‌ అంటూ చేసిన ఒక్క ట్వీట్‌తో ఆయన అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. ఆయన శుక్రవారం చేసిన ట్వీట్‌ నెటిజన్లను  కూడా ఆలోచనలో పడేసింది. ‘హాయ్‌! మీ అందరికి ఒక సర్‌ప్రైజ్‌.. వేచి చూస్తూ ఉండండి’ అని అభిషేక్‌  ట్వీట్‌ చేయడంతో  ఒక్కసారిగా అందరిలోనూ ఉత్సుకత మొదలైంది.  ఏమై ఉంటుందబ్బా అని కొందరు మెదడుకు పదును పెడుతోంటే.. మరికొందరు ఉండబట్టలేక సందేహాలు గుప్పిస్తున్నారు. ‘మరో జునియర్‌ బచ్చన్‌ రాబోతున్నారా.. మాజీ విశ్వసుందరి మరోసారి తల్లి కాబోతున్నారా?, అరాధ్యాకు చెల్లి లేక తమ్ముడు రాబోతున్నారా’ అంటూ ఐశ్వర్యరాయ్‌ ప్రెగ్నెన్సీపై కామెంట్లు చేస్తున్నారు. అదేవిధంగా అభిషేక్‌ ‘ధూమ్‌-5’ చిత్రం గురించి ఏదైనా చెప్పబోతున్నారా, లేక ఆయన సినీ జీవితానికి రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నారా అంటూ ఎవరికి తోచినట్టుగా వారు రకరకాల  సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాదు బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌కి ఏమైందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కేబీసీ (కౌన్‌ బనేగా కరోడ్‌పతి)కి ఇకనుంచి అభిషేక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారా అని  ట్వీట్‌ చేశారు. అయితే అసలు విషయం ఎంటన్నది మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఈ సందేహాలకు, ఆందోళనకు తెరపడాలంటే అభిషేక్‌ మరో సర్‌ప్రైజ్‌ ట్వీట్‌ కోసం వేచి చూడాల్సిందే. కాగా ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్‌ నటిస్తున్న ‘బాబ్‌ బిస్వాస్‌’ చిత్రం షూటింగ్‌ను  ప్రారంభించినట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top