ఇన్ఫోసిస్ నాకు మద్దతుగా నిలిచింది: విశ్వకాంత్ | infosys supported me a lot, says viswakanth ankireddy | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ నాకు మద్దతుగా నిలిచింది: విశ్వకాంత్

Dec 18 2014 5:05 PM | Updated on Sep 2 2017 6:23 PM

ఇన్ఫోసిస్ నాకు మద్దతుగా నిలిచింది: విశ్వకాంత్

ఇన్ఫోసిస్ నాకు మద్దతుగా నిలిచింది: విశ్వకాంత్

కష్టకాలంలో తనకు అన్ని వర్గాల నుంచి చక్కటి మద్దతు లభించిందని ఆస్ట్రేలియాలో తీవ్రవాది చేతుల్లోంచి క్షేమంగా బయటపడిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజీనర్ అంకిరెడ్డి విశ్వకాంత్ చెప్పారు.

కష్టకాలంలో తనకు అన్ని వర్గాల నుంచి చక్కటి మద్దతు లభించిందని ఆస్ట్రేలియాలో తీవ్రవాది చేతుల్లోంచి క్షేమంగా బయటపడిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజీనర్ అంకిరెడ్డి విశ్వకాంత్ చెప్పారు. ప్రధానంగా తన కంపెనీ.. ఇన్ఫోసిస్ యాజమాన్యం తనకు మద్దతుగా నిలిచిందన్నారు. స్నేహితులు, సన్నిహితులు, ఆస్ట్రేలియా ప్రజలు, భారత ప్రభుత్వం నుంచి చక్కటి మద్దతు లభించిందని తెలిపారు. జరిగిన ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నట్లు చెప్పారు.

తాను క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు కోరుకున్నారని, అందుకు వారందరికీ కృతజ్ఞతలని విశ్వకాంత్ అన్నారు. భారత ప్రధాని కార్యాలయానికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే.. ప్రస్తుతానికి తనకు, తన కుటుంబానికి కొంత వెసులుబాటు ఇవ్వాలని మాత్రం మీడియాను విశ్వకాంత్ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement