అమెరికాలో హైదరాబాద్‌ మహిళా ఇంజినీర్‌కు భారీ షాక్‌..! | Software Jobs Fraud Case In Hyderabad | Sakshi
Sakshi News home page

అమెరికాలో హైదరాబాద్‌ మహిళా ఇంజినీర్‌కు భారీ షాక్‌..!

Jun 28 2026 9:45 AM | Updated on Jun 29 2026 12:05 PM

Software Jobs Fraud Case In Hyderabad

బంజారాహిల్స్‌ (హైద‌రాబాద్‌): జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–2లో నివసించే మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామని  సిగ్నా ఎల్‌ఎల్‌సీ సంస్థతో పాటు అలీ బాఖురి, శ్రీతి కర్మాకర్, హుస్సేన్‌ బాఖురి, తరుణ్‌ వీసా ప్రాసెసింగ్‌ కోసం రీఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.3.95 లక్షలు వసూలు చేశారు. నకిలీ ఉపాధి పత్రాలను ఇచ్చారు. ఆమె అమెరికా వెళ్లగా.. అధికారులు పత్రాలను పరిశీలించగా నకిలీవని తేలింది. 

ఆమె వీసాను రద్దు చేసి ఐదేళ్ల పాటు అమెరికా రాకుండా నిషేధం విధిస్తూ తిప్పి పంపారు. బాధితురాలు నగరానికి వచ్చాక నిందితులను నిలదీయగా సెటిల్‌మెంట్‌ పత్రంపై సంతకం చేయించుకుని రూ.4 లక్షలు చెల్లించారు. ఈ మోసం కారణంగా ఉద్యోగం పోవడంతో పాటు ఖర్చులు, ఇతర రూపాల్లో మొత్తం రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లింది. మిగిలిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించగా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement