డిస్ట్రబ్‌ చేసింది.. స్టార్‌ అయ్యింది

The Cat Disturbs Weatherman Report Becomes Internet Sensation - Sakshi

న్యూయార్క్‌ :  ముఖ్యమైన పనిలో ఉన్న వారినెవరినైనా డిస్ట్రబ్‌ చేస్తే ఏమవుంది? ముఖం వాచేలా చివాట్లు తినాల్సుంటుంది. కానీ, బెట్టీ మాత్రం సెలెబ్రిటీ అయిపోయింది. యాజమానితో పాటు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వివరాలు.. అమెరికాకు చెందిన జెఫ్ఫి లైయాన్స్‌ అనే వ్యక్తి 14న్యూస్‌లో వెదర్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఓ రోజు జెఫ్ఫి వెదర్‌ రిపోర్ట్‌ చదువుతుండగా తన పెంపుడు పిల్లి బెట్టీ లైవ్‌లోకి వచ్చింది. దీంతో ఆ షోకు ప్రేక్షకుల నుంచి బాగా రెస్పాన్స్‌ వచ్చింది. ఇక అప్పటినుంచి బెట్టీ సెలెబ్రిటీ లైఫ్‌ మొదలైంది. ప్రస్తుతం యాజమానితో కలిసి  షోలు చేస్తోంది. అంతేకాకుండా ఆ షోలో తనకంటూ సొంతంగా ఓ భాగాన్ని సంపాదించుకునే స్థాయికి ఎదిగింది. బెట్టీకి సంబంధించిన అప్‌డేట్లు ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంటు ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నాయి.

చదవండి : వైరల్‌ : ఇదేం వింత స్నేహం?!

బిడ్డ‌ల కోసం రాళ్లు వండుతున్న త‌ల్లి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top