కారుబాంబు దాడిలో 11 మంది మృతి | 11 people are killed by car bomb targeting police near Istanbul | Sakshi
Sakshi News home page

కారుబాంబు దాడిలో 11 మంది మృతి

Jun 7 2016 7:55 PM | Updated on Aug 14 2018 3:22 PM

కారుబాంబు దాడిలో 11 మంది మృతి - Sakshi

కారుబాంబు దాడిలో 11 మంది మృతి

టర్కీలోని ఇస్తాంబుల్లో మంగళవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు

ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్లో మంగళవారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని కారుబాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు అధికారులతో పాటు, నలుగురు పౌరులు మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. ఆందోళన కారులను అదుపుచేసే రయట్ కంట్రోల్ పోలీసు బృందం బస్సులో వెళ్తుండగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.

పట్టణంలో పర్యటకులతో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో రోడ్డు పక్కన గల భవంతులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ వాసిప్ సహిన్ తెలిపారు. దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ వివరాలు తెలియలేదు.

Advertisement
 
Advertisement
Advertisement