బాబుకు ఆడబిడ్డలుంటే తెలిసొచ్చేది | ysrcp mla roja slams chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబుకు ఆడబిడ్డలుంటే తెలిసొచ్చేది

Nov 20 2016 1:34 AM | Updated on Nov 9 2018 4:36 PM

బాబుకు ఆడబిడ్డలుంటే తెలిసొచ్చేది - Sakshi

బాబుకు ఆడబిడ్డలుంటే తెలిసొచ్చేది

‘చంద్రబాబుకు ఆడబిడ్డలు లేరు కాబట్టి వారి విలువేంటో, వారి బాధేంటో తెలియడంలేదు. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆందోళన, ఆక్రందన, ఆవేదన అర్థం కావడంలేదు.

- ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా
- విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోరా?
 
 సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబుకు ఆడబిడ్డలు లేరు కాబట్టి వారి విలువేంటో, వారి బాధేంటో తెలియడంలేదు. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆందోళన, ఆక్రందన, ఆవేదన అర్థం కావడంలేదు. కానీ, చంద్రబాబును కన్నదొక మహిళ. సంసారం చేసేది ఒక మహిళ. కోడలు కూడా మహిళేనన్న సంగతిని ఆయన గుర్తించాలి. మహిళలకు రక్షణ ఇవ్వలేని సీఎం రాష్ట్రంలో ఉన్నా లేకపోరుునా ఒకటే’ అని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బీచ్ ఫెస్టివల్, బీర్ పార్లర్‌లపై ఉన్న శ్రద్ధ ఆడపిల్లల జీవితాలు కాపాడటంలో లేదని మండిపడ్డారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు,  మహిళలకు రక్షణ కల్పించలేని చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ఎంత? ఊడితే ఎంత? అని ప్రశ్నించారు.

కర్నూలు జిల్లాలో ఉషారాణి అనే ఇంజినీరింగ్ విద్యార్థిని చనిపోరుు ఒక రోజైనా గడవక ముందే అదే జిల్లాలో చైతన్య కళాశాలలో చదువుతున్న లోక్‌నాథ్ చౌదరి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దారుణమన్నారు.ఆయన పాలనలో మహిళలపై అఘారుుత్యాలు, అత్యాచారాలు, అరాచకాలు, విద్యార్థుల ఆత్మహత్యల్లో నెంబర్ ఒన్ అరుుందని విమర్శించారు. కుల గజ్జి, పార్టీ గజ్టి, దోపిడీదారుల గజ్జితో ప్రభుత్వ పెద్దలు నిందితులను కాపాడటం వల్లనే విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. తొలి తప్పు జరిగినపుడే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ఐఏఎస్ అధికారి చక్రపాణి, పద్మావతీ మహిళా యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రత్నకుమారితో ఏర్పాటైన కమిటీ నివేదిక ఏమైందో తెలపాలని ఆమె డిమాండ్ చేశారు.

 మంత్రివర్గంలో రావణాసురులు
 చంద్రబాబు మంత్రివర్గంలో రావణాసురులున్నారని రోజా మండిపడ్డారు. గంటా శ్రీనివాసరావు, నారాయణ, కామినేని శ్రీనివాస్... ఇలా అందరూ ఆడవారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారేనని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తహశీల్దారు వనజాక్షిని ఈడ్చి దౌర్జన్యం చేస్తే  చర్య తీసుకోలేదన్నారు. ఉషారాణితో పాటు విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించాల్సిన గంటా విదేశాల్లో వినోదం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఉషారాణి ర్యాగింగ్‌కు గురవుతోందని సాక్షాత్తూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... గంటాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేసే వారికి టీసీలు ఇచ్చి పంపాలని, లైంగిక వేధింపులకు పాల్పడిన అధ్యాపకులను పోలీసులకు అప్పగించాలని, ఆత్మహత్యలపై వేసిన కమిటీ ఇచ్చిన నివేదికను బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement