'పద్మ' అవార్డు విజేతలకు జగన్ శుభాకాంక్షలు | YS Jagan wishes to Padma award winners | Sakshi
Sakshi News home page

'పద్మ' అవార్డు విజేతలకు జగన్ శుభాకాంక్షలు

Jan 25 2016 5:36 PM | Updated on Apr 4 2018 9:25 PM

భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వివిధ రంగాలకు చెందిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు వైఎస్పార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.

భారత ప్రభుత్వం  ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వివిధ రంగాలకు చెందిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు వైఎస్పార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ నృత్యకళాకారిణి యామినీ కృష్ణమూర్తి, పత్రికా సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు, పద్మభూషణ్‌కు ఎంపికైన ప్రముఖ డాక్టర్ కె.నాగేశ్వరరెడ్డి, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రసిద్ధ క్రీడాకారిణులు సానియా మీర్జా, నైనా నెహ్వాల్, పద్మశ్రీకి ఎంపికైన ప్రసిద్ధ చలన చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తదితరులకు వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.


 

Advertisement
 
Advertisement
Advertisement