సినీ రంగాన్ని చొప్పిస్తే సహించం | Warning to the Subbirama Reddy | Sakshi
Sakshi News home page

సినీ రంగాన్ని చొప్పిస్తే సహించం

Jan 20 2018 1:48 AM | Updated on Aug 10 2018 5:26 PM

Warning to the Subbirama Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాకతీయ కళా వైభవం పేరుతో నటులను సన్మానిస్తే సహించబోమని కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు.. మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డిని హెచ్చరించింది. ఈ పేరుతో స్థానిక కళలు, కళాకారుల పురోగతికి తోడ్పడితే స్వాగతిస్తామంది. శుక్రవారం కాకతీయ హెరిటేజ్‌ వ్యవస్థాపక సభ్యుడు పాపారావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి సినిమా రంగం తీవ్ర నష్టం చేసిన సంగతి   గుర్తించాలన్నారు.

సినిమా సంస్కృతిని బుద్ధిస్ట్‌ హెరిటేజ్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేయటం తగదన్నారు. ఇలాంటి చర్యలను ముందుగానే అడ్డుకోవాలన్నారు. రెండు రోజుల క్రితం సుబ్బిరామిరెడ్డి నగరంలోని శిల్పకళావేదికలో నటుడు మోహన్‌బాబును సన్మానించి బిరుదు ప్రదానం చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement