ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం: కొప్పుల | The failure of the opposition: KOPPULA | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం: కొప్పుల

Apr 3 2016 3:47 AM | Updated on Mar 18 2019 8:51 PM

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం: కొప్పుల - Sakshi

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం: కొప్పుల

సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ముఖం చాటేసిన కాంగ్రెస్ నేతలు..

సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు ముఖం చాటేసిన కాంగ్రెస్ నేతలు.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శాసనమండలి సభ్యుడు నారదాసు లక్ష్మణరావుతో కలసి శనివారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

సీఎం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై అన్ని వర్గాల నుంచి అభినందనలు లభిస్తుండగా.. కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించి అవగాహన మాత్రమే కుదిరిందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో రూ. 8 వేల కోట్ల మేర కాంగ్రెస్ నాయకులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement