బోనాల పండుగకు రూ.10 కోట్లేనా? | Rs.10 crore to bonala festivals? | Sakshi
Sakshi News home page

బోనాల పండుగకు రూ.10 కోట్లేనా?

Jul 13 2014 1:20 AM | Updated on Mar 28 2019 8:37 PM

బోనాల పండుగకు రూ.10 కోట్లేనా? - Sakshi

బోనాల పండుగకు రూ.10 కోట్లేనా?

నగరంలోని బోనాల ఉత్సవాలకు రూ.100కోట్లు విడుదల చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే కేవలం రూ.10 కోట్లు...

ఎంపీ దత్తాత్రేయ అసంతృప్తి
రాంగోపాల్‌పేట్: నగరంలోని బోనాల ఉత్సవాలకు రూ.100కోట్లు విడుదల చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే కేవలం రూ.10 కోట్లు కేటాయించడం దారుణమని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఆయన ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిధుల మంజూరులో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. చివరకు ఆ నిధులను సైతం ఆయా శాఖల నుంచే కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరిన్ని నిధులు కేటాయించి భారీ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు శ్యాంసుందర్‌గౌడ్, భవర్‌లాల్‌వర్మ, పిల్లి శ్రీనివాస్, పెద్ది రవీందర్, బీరం నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement