తల్లితో సహజీవనం, కుమార్తెపై అత్యాచారం | Repist arrested in hyderabad | Sakshi
Sakshi News home page

తల్లితో సహజీవనం, కుమార్తెపై అత్యాచారం

Dec 2 2015 7:01 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో ఓ కామంధుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సైదాబాద్: హైదరాబాద్లో ఓ కామంధుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి మందపల్లి సుజాతకు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె(13) ఉన్నారు. అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం శ్రీనివాస్ చనిపోయాడు. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి చంపాపేట సమీపంలోని సింగరేణి కాలనీ నివాసం ఉంటున్నారు.

కొన్ని రోజులుగా ఎర్రగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ అంజాద్(32)తో సుజాత సహజీవనం చేస్తుంది. సుజాత కుమార్తె తన సోదరి దగ్గర పరిగిలో ఉంటూ ఏడో తరగతి చదువుకుంటుంది. సుజాత అనారోగ్యానికి గురి కావటంతో రెండు నెలలుగా ఆమె తల్లి వద్దే ఉంటోంది. ఇది అంజాద్‌కు నచ్చకపోవడంతో సుజాతను తీవ్రంగా కొడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుజాత బయటకు వెళ్లగా అంజాద్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన సుజాత సాయంత్రం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement