breaking news
Repist
-
రేపిస్ట్‌కు మరణశిక్ష : రికార్డ్ టైంలో తీర్పు
సాక్షి, ఇండోర్: దేశంలోనే అతి వేగవంతమైన తీర్పును ఇండోర్ జిల్లా కోర్టు వెలువరించింది. పసిగుడ్డుపై హత్యాచారానికి పాల్పడ్డ ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఈ సంచలన తీర్పునిచ్చి రికార్డు సృష్టించింది. కేసు నమోదైన కేవలం 23 రోజుల్లోనే ముద్దాయికి మరణ శిక్షను విధించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గత నెలలో నాలుగు నెలల పసిపాపను అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన ఉదంతంలో నవీన్ గడ్కే (21) కి శనివారం జిల్లా కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసును చాలా అరుదైన కేసుగా పరిగణించి, ముద్దాయికి మరణశిక్ష విధించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్రమ్ షేక్ కోర్టును కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వర్ష శర్మ.. ఏడవడం తప్ప ఏమీ తెలియని పసిపాపపై ఇది అమానుష చర్య అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 20న ఇండోర్ నగరంలోని రాజ్వాడా ఫోర్ట్ సమీపంలో తల్లిపక్కనే నిద్రిస్తున్న అభం శుభం తెలియని నాలుగు నెలల పసికందును ఎత్తుకెళ్లిన నవీన్ అత్యాచారం చేసి అనంతరం హత్య చేయడం కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఏప్రిల్ 21న నిందితుడిని అరెస్టు చేశారు. కాగా కథువా, ఉన్నావ్ తదితర ఘటనల నేపథ్యంలో సీరియస్‌గా స్పందించిన కేంద్ర ప్రభుత్వం పన్నెండేళ్లలోపు వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను ఇటీవల ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమ్మతించిన సంగతి తెలిసిందే. -
తల్లితో సహజీవనం, కుమార్తెపై అత్యాచారం
సైదాబాద్: హైదరాబాద్‌లో ఓ కామంధుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి మందపల్లి సుజాతకు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన శ్రీనివాస్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె(13) ఉన్నారు. అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం శ్రీనివాస్ చనిపోయాడు. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి చంపాపేట సమీపంలోని సింగరేణి కాలనీ నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా ఎర్రగడ్డకు చెందిన ఆటో డ్రైవర్ అంజాద్(32)తో సుజాత సహజీవనం చేస్తుంది. సుజాత కుమార్తె తన సోదరి దగ్గర పరిగిలో ఉంటూ ఏడో తరగతి చదువుకుంటుంది. సుజాత అనారోగ్యానికి గురి కావటంతో రెండు నెలలుగా ఆమె తల్లి వద్దే ఉంటోంది. ఇది అంజాద్‌కు నచ్చకపోవడంతో సుజాతను తీవ్రంగా కొడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుజాత బయటకు వెళ్లగా అంజాద్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన సుజాత సాయంత్రం సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.