రుణమాఫీపై కేసీఆర్ నిర్లక్ష్యం:గండ్ర | KCR negligence on the Loan waiver : Gandra | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై కేసీఆర్ నిర్లక్ష్యం:గండ్ర

Jul 21 2016 4:15 AM | Updated on Aug 14 2018 10:59 AM

రుణమాఫీపై కేసీఆర్ నిర్లక్ష్యం:గండ్ర - Sakshi

రుణమాఫీపై కేసీఆర్ నిర్లక్ష్యం:గండ్ర

వర్షాలు కురుస్తున్నా, ఖరీఫ్ పనులు ప్రారంభమైనా పంట రుణాలను మాఫీ చేయడంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్ : వర్షాలు కురుస్తున్నా, ఖరీఫ్ పనులు ప్రారంభమైనా పంట రుణాలను మాఫీ చేయడంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తక్షణమే రూ.6 వేల కోట్ల రుణ బకాయిలను విడుదల చేసి, రైతులను రుణ విముక్తులను చేయాలని, మెడిసిన్ ఎంట్రన్స్ పేపర్ లీక్ అయిందని వస్తున్న ఆరోపణలపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, లీక్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement