AP: తీవ్ర వాయుగుండం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు | Rains In Andhra Pradesh Due To Effect Of Depression | Sakshi
Sakshi News home page

AP: తీవ్ర వాయుగుండం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

Jul 30 2026 7:05 AM | Updated on Jul 30 2026 7:05 AM

Rains In Andhra Pradesh Due To Effect Of Depression

సాక్షి, అమరావతి: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో 7.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. కృష్ణా జిల్లా కంకిపాడులో 6.7, పెనమలూరులో 6.46, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లిలో 6.2, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో 6, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో 5.8

..ఏలూరు జిల్లా కలి­దిండిలో 5.5, పశ్చిమ గోదావరి జిల్లా భీమ­వరం, ఏలూరు జిల్లా ముదినేపల్లిలో 5.2, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై ఉన్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో గురువారం పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement