టీఆర్‌ఎస్‌లో బావాబావమరుదుల పోరు | gandra venkataramana slams trs government | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో బావాబావమరుదుల పోరు

Apr 20 2017 12:47 AM | Updated on Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్‌లో బావాబావమరుదుల పోరు - Sakshi

టీఆర్‌ఎస్‌లో బావాబావమరుదుల పోరు

టీఆర్‌ఎస్‌లో బావాబావమరుదుల పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌కు సమర్ధవంతమైన నాయకత్వం ఉంది.

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో బావాబావమరుదుల పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌కు సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. ఎవరో వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గండ్ర వెంకటరమణ అన్నారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హమీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ సంఘం ఎన్నకలను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా జీవో తెచ్చింది.

తిరిగి ఈ విషయంపై జాగృతి కార్యకర్తలే దీనిపై కోర్టును ఆశ్రయించారు. అసమర్ధ వాదన వల్ల తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. ఓ కేసు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినందుకు జనార్ధన్‌ రెడ్డి తన పదవికి రాజీనీమా చేశారు. అలాంటిది ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పటికి 20 కేసుల్లో వ్యతిరేక తీర్పులొచ్చాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement