breaking news
gandra venkataramana
-
టీఆర్ఎస్లో బావాబావమరుదుల పోరు
హైదరాబాద్: టీఆర్ఎస్లో బావాబావమరుదుల పోరు నడుస్తోంది. కాంగ్రెస్కు సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. ఎవరో వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణ అన్నారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హమీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ సంఘం ఎన్నకలను దృష్టిలో పెట్టుకొని హడావిడిగా జీవో తెచ్చింది. తిరిగి ఈ విషయంపై జాగృతి కార్యకర్తలే దీనిపై కోర్టును ఆశ్రయించారు. అసమర్ధ వాదన వల్ల తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. ఓ కేసు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినందుకు జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనీమా చేశారు. అలాంటిది ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పటికి 20 కేసుల్లో వ్యతిరేక తీర్పులొచ్చాయన్నారు. -
వరంగల్ జిల్లాపై సీఎం కక్ష గట్టారు : గండ్ర
వరంగల్ : వరంగల్ జిల్లాపై సీఎం కేసీఆర్ కక్ష గట్టారని ప్రభుత్వ మాజీ విప్ గండ్ర వెంకటరమణ అన్నారు. ఆదివారం వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పిట్టకథలు చెప్పడంలో దిట్ట అని విమర్శించారు. 15 నెలల పాలనలో దేవాదుల ప్రాజెక్టుపై రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. దేవాదుల మూడో దశకు నిధులు విడుదల చేయాలని గండ్ర ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కంతానపల్లి ప్రాజెక్టుతోపాటు జిల్లాలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని కోరారు. అలాగే భూపాలపల్లి జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.