వరంగల్ జిల్లాపై సీఎం కక్ష గట్టారు : గండ్ర | T Congress leader Gandra Venkataramana fires on Telangana CM KCR | Sakshi
Sakshi News home page

వరంగల్ జిల్లాపై సీఎం కక్ష గట్టారు : గండ్ర

Jul 26 2015 12:01 PM | Updated on Sep 3 2017 6:13 AM

వరంగల్ జిల్లాపై సీఎం కేసీఆర్ కక్ష గట్టారని ప్రభుత్వ మాజీ విప్ గండ్ర వెంకటరమణ అన్నారు.

వరంగల్ : వరంగల్ జిల్లాపై సీఎం కేసీఆర్ కక్ష గట్టారని ప్రభుత్వ మాజీ విప్ గండ్ర వెంకటరమణ అన్నారు. ఆదివారం వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పిట్టకథలు చెప్పడంలో దిట్ట అని విమర్శించారు. 15 నెలల పాలనలో దేవాదుల ప్రాజెక్టుపై రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు.

దేవాదుల మూడో దశకు నిధులు విడుదల చేయాలని గండ్ర ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కంతానపల్లి ప్రాజెక్టుతోపాటు జిల్లాలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని కోరారు. అలాగే భూపాలపల్లి జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement