కూకట్పల్లిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య | B tech student commits suicide in kukatpally | Sakshi
Sakshi News home page

కూకట్పల్లిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Nov 20 2015 7:06 AM | Updated on Sep 3 2017 12:46 PM

కూకట్పల్లిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

కూకట్పల్లిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

కూకట్పల్లి నిజాంపేటలో బీటెక్ విద్యార్థి కృష్ణ చైతన్య శుక్రవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్ : కూకట్పల్లి నిజాంపేటలో బీటెక్ విద్యార్థి కృష్ణ చైతన్య గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ర్యాగింగ్ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన సూసైడ్ నోట్ను గుర్తించిన అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణ చైతన్య మృతదేహంతోపాటు సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కృష్ణచైతన్య మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నైలోని సత్యభామ వర్శిటీలో కృష్ణచైతన్య బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. దీపావళి పండగ సెలవుల నేపథ్యంలో కృష్ణ చైతన్య  ఇంటి వచ్చాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. విజయవాడకు చెందిన శేఖర్ అనే తన హాస్టల్లోని సహ విద్యార్థి చేసే ర్యాగింగ్కి తట్టుకోలేకపోయినట్లు కృష్ణ చైతన్య ఆ లేఖలో వివరించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement