ప్రేమికుల రోజున విషాదం చోటు చేసుకుంది.
ప్రేమను నిరాకరించిందని..
Feb 15 2016 11:40 AM | Updated on Aug 29 2018 8:38 PM
మంథని: ప్రేమికుల రోజున విషాదం చోటు చేసుకుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న యువతి తన ప్రేమను నిరాకరించిందని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మంథని మండలం పుట్టపాక పంచాయతి పరిధిలోని చెర్లపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాలు.. గ్రామానికి చెందిన రేపాక దేవేందర్(21) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో పక్క గ్రామానికి చెందిన యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా తన మనసులో మాటను ఆమెకు చెప్పాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి అర్థరాత్రి ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించడంతో.. దాని ఆధారంగా చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Advertisement


