ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు: కవిత | general elections campaign in kalvakuntla kavitha | Sakshi
Sakshi News home page

ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు: కవిత

Apr 24 2014 1:41 AM | Updated on Mar 18 2019 9:02 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రలోభాలకు గురిచేసి, ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయని టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి కె. కవిత ఆరోపించారు.

నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రలోభాలకు గురిచేసి, ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయని టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి కె. కవిత ఆరోపించారు.  బుధవారం ఆమె నిజామాబాద్ మండలం బోర్గం గ్రామంలో ఎన్నికల ప్ర చారం నిర్వహించారు.  

ఈ సందర్భంగామాట్లాడుతూ.. 20 యేళ్ళు రాష్ట్రా న్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తెలంగాణకు తీరని అన్యా యం చేశాయన్నారు.  కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల మద్దతుతో ఉద్యమాన్ని  ఉధృతం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు తె లి పారు.  

తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. అనంతరంపార్టీ రూరల్  అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ నియోజక వర్గాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.   కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు  సంతోష్, ఈగ గంగారెడ్డి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement