పవన్‌కల్యాణ్‌పై మండిపాటు | Angry on Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌కల్యాణ్‌పై మండిపాటు

Apr 3 2014 6:05 PM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్‌ కల్యాణ్‌ - Sakshi

పవన్‌ కల్యాణ్‌

పవర్ స్టార్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్‌పై వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు.

అనంతపురం: పవర్ స్టార్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్‌పై వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అతిపెద్ద ఫ్యాక్షనిస్ట్ అని విమర్శించారు.  దివంగత టిడిపి నేత పరిటాల రవి ద్వారా వందలాదిమందిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు.

 చంద్రబాబు హయాంలో శాంతిభద్రతలు బేషుగ్గా ఉన్నాయని చెప్పడం పవన్‌కే చెల్లిందని మండిపడ్డారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పవన్‌కల్యాణ్‌కు గుండుకొట్టించారన్న ప్రచారం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు.  ఇది వాస్తవమో కాదో కల్యాణే చెప్పాలని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement