క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ | YS Jagan mohan reddy consoles khammam road accident victims | Sakshi
Sakshi News home page

క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ

Aug 22 2016 2:31 PM | Updated on Jul 25 2018 4:09 PM

క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ

ఖమ్మం జిల్లా రోడ్డు ప్రమాద బాధితులను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పరామర్శించారు.

ఖమ్మం: ఖమ్మం జిల్లా రోడ్డు ప్రమాద బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఆయన, వారి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  అంతకు ముందు వైఎస్ జగన్ నాయకన్ గూడెం వద్ద బస్సు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు.

ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది దుర్మరణం చెందగా, మరో 17మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాద వార్త తెలుసుకున్న  వైఎస్ జగన్ ...బాధితులను పరామర్శించుకునేందుకు ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement