breaking news
nayankan gudem
-
'రాజకీయాలు చేయడానికి రాలేదు'
హైదరాబాద్ : మానవతా దృక్పధంతో రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవాలని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది దుర్మరణం చెందగా, మరో 17మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆయన ఆరా తీశారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ....'బస్సు ప్రమాదం ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. గత నెల (జూలై 24న) కూడా ఓ బస్సు నీళ్లలో పడి, ఓ పాప చనిపోయింది. నెలరోజులు కూడా కాకముందే మళ్లీ అదే ప్రాంతంలో ప్రమాదం. ప్రయివేట్ బస్సు సాకుతో ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదు. చికిత్స పొందుతున్న బాధితులు కోలుకోవాలంటే ఇంచుమించు ఆరు నెలలైనా పడుతుంది. ఏరకంగా చూసుకున్నా వాళ్లు బయటకు వెళ్లి పనులు చేసుకోలేని పరిస్థితి. వీరిని ఆదుకునే విషయంలో ప్రభుత్వం స్పందించాలి. ప్రజలకు ప్రైవేట్ బస్సా? ఇంకో బస్సా అని తెలియదు. ప్రయాణికులు చేసిన తప్పేంటి?. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకోవటంతో పాటు, గాయపడి చికిత్స పొందుతున్నారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు, చికిత్స పొందుతున్నవారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. మానవతా దృష్ట్యా వారిని ఆదుకోవాలి. ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్ అయితే థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ఉంటుంది. ఆ బస్సుకు సంబంధించిన ఇన్సురెన్స్ త్వరగా వచ్చేలా చూడాలి. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం లేదు. రాజకీయాలు చేయడానికి రాలేదు. ఎవరినీ తప్పుపట్టదలచుకోలేదు. ప్రమాదం జరిగింది ప్రయివేట్ బస్సు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బాధితులకు తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఘటన జరిగినా వెళ్లడం లేదు. ఆయన రాకున్నప్పటికీ బాధితుల్ని ఆదుకోవాలి. ఇక ప్రయివేట్ బస్సుల వ్యాపారాలన్నీ టీడీపీ నేతలే చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కూడా విన్నవిస్తున్నా. ఇదే బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కాస్త దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నా' అని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు అన్నవిధాలా అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
బాధిత కుటుంబాలకు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా
ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబసభ్యులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ పీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని చినరాజప్ప పేర్కొన్నారు. ఏపీలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి..వాటి నివారణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు నాయకన్‌గూడెం ప్రజలు బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడటం కోసం చేసిన కృషి మరవలేనిదన్నారు. ఇక్కడి వైద్య సిబ్బంది, పోలీస్, ఇతర అధికారులు సంఘటన జరగగానే స్పందించిన తీరు ప్రశంసనీయమన్నారు. హాంమంత్రి వెంట తూర్పుగోదావరి జిల్లా డీఐజీ రామకృష్ణ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు ఉన్నారు. కాగా బస్సు ప్రమాదంలో పదిమంది దుర్మరణం చెందగా, మరో 18మంది గాయపడిన విషయం తెలిసిందే. -
'రాజకీయాలు చేయడానికి రాలేదు'
-
క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ
ఖమ్మం: ఖమ్మం జిల్లా రోడ్డు ప్రమాద బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఆయన, వారి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు వైఎస్ జగన్ నాయకన్ గూడెం వద్ద బస్సు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది దుర్మరణం చెందగా, మరో 17మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాద వార్త తెలుసుకున్న వైఎస్ జగన్ ...బాధితులను పరామర్శించుకునేందుకు ఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. -
క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ
-
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు
-
బస్సు ప్రమాదం దురదృష్టకరం
-
బస్సు ప్రమాదం దురదృష్టకరం: మంత్రి తుమ్మల
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్, ఖమ్మం ఎస్పీ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియాపూర్ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న ప్రైవేటుబస్సు నాయకన్ గూడెం వద్ద నాగార్జున సాగర్ (ఎన్ఎస్పీ) కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాయకన్ గూడెం రోడ్డు మలుపు వద్ద ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న రిస్య్కూ టీం, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలిని పర్యవేక్షించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నాలుగు అడుగుల మేర నీళ్లు ఉండటంతో 2 క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మూడు 108 వాహనాలలో 18 మంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరొకొంతమందిని పాలేరు, నాయకన్‌గూడెం ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు: 10మంది మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియాపూర్ నుంచి సూర్యపేట, ఖమ్మం మీదుగా రాజమండ్రి వయా కాకినాడకు వెళుతున్న యాత్రజినీ ప్రైవేటు బస్సు నాయకన్ గూడెం వద్ద నాగార్జున సాగర్ (ఎన్ఎస్పీ) కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 10 మంది మృతి చెందగా, 26 మందికి గాయాలయ్యాయి. బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాయకన్ గూడెం రోడ్డు మలుపు వద్ద ఒక్కసారిగా కాల్వలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న రిస్య్కూ టీం, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలిని పర్యవేక్షించిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నాలుగు అడుగుల మేర నీళ్లు ఉండటంతో 2 క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొకొంతమందిని పాలేరు, నాయకన్‌గూడెం ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నెల్లూరుకు చెందిన జనార్దన్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయిన బస్సు నెంబర్ ఏపీ26 టీసీ9512 పోలీసులు గుర్తించారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాంతో పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్టు ఖమ్మం డీఎస్పీ సురేశ్ కుమార్ తెలిపారు. మూడు 108 వాహనాలలో 17 మంది క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని డీఎస్పీ చెప్పారు. బస్సు ప్రమాదంపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. బస్సు బయటకు తీశాక మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని డీఎస్పీ వెల్లడించారు. కాగా, ఖమ్మం జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు ఏపీలోనూ రెండు చోట్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో బస్సు ప్రమాదాలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డుప్రమాదాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వైఎస్ జగన్ తెలిపారు. బస్సులో ప్రయాణికుల వివరాలు ఇలా ఉన్నాయి.. సత్యనారాయణ (రామచంద్రాపురం), బాలకృష్ణ (ద్రాక్షారామం), ధనలక్ష్మీ (ద్రాక్షారామం), లక్ష్మణ సతీష్ (రాజమండ్రి), అశోక్ కుమార్, చంద్ర, ప్రశాంత్, మోస, లావణ్య, వెంకటేశ్, యదిరాజు, మనీ, డీఎస్ రావు, లక్ష్మీ, వరలక్ష్మి, సురేష్, సత్య, విజయ్, లక్ష్మీ, వినయ్, సుబ్బారెడ్డి, గణేష్, సూరిబాబు, శ్రీను, దుర్గా ప్రసాద్, ఐసి పలువురు ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.