పదోతరగతి విద్యార్థినితో ప్రేమాయణం.. | Young man's murder | Sakshi
Sakshi News home page

పదోతరగతి విద్యార్థినితో ప్రేమాయణం..

Jun 23 2016 2:03 PM | Updated on Aug 29 2018 4:18 PM

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది.

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. అభం శుభం తెలియని చిన్నారిని ప్రేమ పేరుతో వాడుకుంటున్నాడని ఓ యువకుడి పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గుండాల మండలం సీతారాంపురంలో గురువారం వెలుగుచూసింది.

వివరాలు.. గ్రామానికి చెందిన వంపు మహేందర్(25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక(15)ను తన ఆటోలో ప్రతిరోజు మోత్కూరులోని పాఠశాలలో దింపేవాడు. ఈ క్రమంలో ఆ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఈ ఏడాది బాలిక పాఠశాల మారడంతో.. ఆమెతో గొడవ పెట్టుకున్నాడు.

 

ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం పాకడంతో.. ఈ రోజు గుర్తుతెలియని వ్యక్తులు మహేందర్‌పై గొడ్డళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఇది గుర్తించిన కొందరు అతన్ని భువనగిరి ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement