'మీరు సిద్ధమంటే... మేము సిద్ధమే' | y visweswara reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'మీరు సిద్ధమంటే... మేము సిద్ధమే'

Feb 27 2016 1:26 PM | Updated on Jul 28 2018 3:23 PM

'మీరు సిద్ధమంటే... మేము సిద్ధమే' - Sakshi

'మీరు సిద్ధమంటే... మేము సిద్ధమే'

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. ఎన్నికలంటే టీడీపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే టీడీపీలోకి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డబ్బు, అధికార వ్యామోహంతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని విమర్శించారు. 

చంద్రబాబు తీరుపై చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు వలసలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధమంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామని వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం సవాల్ విసిరారు. ఎవరి బలం ఏంటో ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని వై. విశ్వేశ్వరరెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement