మహిళ ఆత్మహత్య | Woman commits suicide ,Harassment ,Real Estate Business | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Dec 15 2016 4:11 AM | Updated on Sep 4 2017 10:44 PM

వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక శ్రీరాంనగర్‌ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది.

శంకర్‌పల్లి: వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానిక  శ్రీరాంనగర్‌ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ క్రాంతికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లకొండ కొండ గ్రామానికి చెందిన నవీన(32) శ్రీధర్‌రెడ్డి దంపతులు శంకర్‌పల్లిలో నివాసం ఉంటున్నారు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే  శ్రీధర్‌రెడ్డి భార్యను వేధిస్తుండడంతో భరించలేక ఆమె బుధవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి చంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement