జీపును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ఇద్దరి మృతి | Two killed in road accident | Sakshi
Sakshi News home page

జీపును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. ఇద్దరి మృతి

May 6 2016 12:27 PM | Updated on Aug 30 2018 4:07 PM

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామం వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని మేఘనా ట్రావెల్స్ బస్సు ఢీకొంది.

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామం వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని మేఘనా ట్రావెల్స్ బస్సు ఢీకొంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న విశాఖకు చెందిన ఘట్టపు మురళీకృష్ణ (32), షేక్ మదీనా (52) తీవ్ర గాయాలతో మృతి చెందారు. యాసీన్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement