సూర్యాపేటరూరల్ : రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట మండలంలోని రామచంద్రాపురం, సోలిపేట గ్రామాల మధ్య రోడ్డుపై చోటు చేసుకుంది.
రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి
Aug 14 2016 11:24 PM | Updated on Sep 28 2018 3:41 PM
సూర్యాపేటరూరల్ : రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట మండలంలోని రామచంద్రాపురం, సోలిపేట గ్రామాల మధ్య రోడ్డుపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్ గ్రామానికి చెందిన అంతటి నర్సయ్య(33) అర్వపల్లి మండలంలో బంధువుల ఇంటికి పండుగకు వెళ్లాడు. తిరిగి 7 గంటల సమయంలో స్వగ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. ఇదే క్రమంలో తుంగతుర్తి మండలం శాంతినగర్‌కు చెందిన కలీం రామచంద్రాపురం వైపు నుంచి తుంగతుర్తికి బైక్‌పై వెళ్తూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో అంతటి నర్సయ్య అక్కడిక్కడే మృతి చెందగా, కలీంకు చెయ్యి విరగడంతో పాటు తీవ్ర గాయాలపాలయ్యాడు. బైక్‌లు రెండు దెబ్బతిన్నాయి. వెంటనే 108 సిబ్బంది గాయాలపాలైన కలీంను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య మృతదేహాన్ని పోలీసులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
Advertisement


