మేయర్ దంపతుల పోస్టుమార్టం పూర్తి | The mayor post-mortem Finished | Sakshi
Sakshi News home page

మేయర్ దంపతుల పోస్టుమార్టం పూర్తి

Nov 18 2015 11:07 AM | Updated on Sep 3 2017 12:40 PM

చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం దారుణహత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం దారుణహత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ మృతదేహానికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వేలూరు ప్రభుత్వాసుపత్రిలో మేయర్ భర్త కఠారి మోహన్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. బుధవారం పోస్టుమార్టం చేసిన అనంతరం మేయర్ భౌతికకాయాన్ని పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి తరలించారు. 

బుధవారం సాయంత్రం 4 గంటలకు వీరి మృతదేహాలకు కార్పొరేషన్ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించనున్నారు. చిత్తూరు మేయర్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన పలువురు నేతలు అనురాధ మృతదేహానికి నివాళులర్పించారు. కాసేపట్లో చిత్తూరుకు కఠారి మోహన్ మృతదేహాన్ని తరలించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement