ఇంజిన్‌ వేడెక్కడంతో లారీ దగ్ధం | Fire Incident At Chittoor: Lorry catches fires in Chittoor District | Sakshi
Sakshi News home page

ఇంజిన్‌ వేడెక్కడంతో లారీ దగ్ధం

May 31 2026 4:44 AM | Updated on May 31 2026 4:44 AM

Fire Incident At Chittoor: Lorry catches fires in Chittoor District

లారీ వద్ద భారీగా చెలరేగిన మంటలు

కుప్పం రోడ్డులో గంటపాటు స్తంభించిన ట్రాఫిక్‌ 

పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు– కుప్పం రహదారిలో బురిశెట్టిపల్లి క్రాస్‌ వద్ద ఓ లారీ శనివారం దగ్ధమైంది. లారీతోపాటు అందులోని స్టీల్‌ పౌడర్‌ పూర్తిగా కాలి బూడిదైంది. డ్రైవర్‌ కిందకు దిగేయడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా..  స్టీల్‌ పౌడర్‌తో లారీ తమిళనాడులోని తూత్తుకూడి నుంచి తాడిపత్రికి బయలుదేరింది.

వి.కోట వద్ద కర్ణాటక పెట్రోల్‌ బంకులో డీజిల్‌ నింపుకొని వస్తుండగా బురిశెట్టిపల్లి వద్ద లారీలోంచి వాసన రావడంతో డ్రైవర్‌ ఆపాడు. ఇంతలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అగ్నిమాపక వాహనం వచ్చే సరికి పూర్తిగా దగ్ధమైంది. గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. దాదాపు రూ.40 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని లారీ డ్రైవర్‌ ఆదినారాయణ తెలిపాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement