పింఛన్‌ కోసం వచ్చి రోడ్డుప్రమాదంలో వృద్ధురాలు మృతి | The lives of elderly | Sakshi
Sakshi News home page

పింఛన్‌ కోసం వచ్చి రోడ్డుప్రమాదంలో వృద్ధురాలు మృతి

Dec 5 2016 11:40 PM | Updated on Sep 5 2018 2:12 PM

పింఛన్‌ కోసం వచ్చి రోడ్డుప్రమాదంలో వృద్ధురాలు మృతి - Sakshi

పింఛన్‌ కోసం వచ్చి రోడ్డుప్రమాదంలో వృద్ధురాలు మృతి

పింఛన్‌ డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న వృద్ధురాలు ద్విచక్రవాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందింది. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

ముదిగుబ్బ : పింఛన్‌ డబ్బు కోసం బ్యాంకుకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న వృద్ధురాలు ద్విచక్రవాహనం ఢీకొనడంతో దుర్మరణం చెందింది. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని  పూజారితండాకు చెందిన లక్ష్మీబాయి (65) తనకు ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్‌ బ్యాంకు ఖాతాలో పడిందేమో తెలుసుకుని డ్రా చేసుకోవాలనుకుంది.  సోమవారం ఆటోలో ముదిగుబ్బలోని  సిండికేట్‌ బ్యాంకు వద్దకు చేరుకుంది. అక్కడ రద్దీ విపరీతంగా ఉండటంతో పింఛన్‌ తీసుకోకుండానే బయటకు వచ్చి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొంది. లక్ష్మీబాయి తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు హుటాహుటిన  ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిపోవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే  ప్రమాదానికి కారణమైన ద్విచక్రవాహనంలోని ముగ్గురిలో నల్లచెరువు మండలం ఉప్పర్లపల్లికి చెందిన ఇమ్రాన్‌, అభిమన్యు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement