తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు | telugu brothers fight | Sakshi
Sakshi News home page

తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

Jan 19 2017 12:05 AM | Updated on Oct 2 2018 6:46 PM

మండలంలోని వనికినిదిన్నె గ్రామంలో బుధవారం రాత్రి తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు.

- వనికినిదిన్నెలో పోలీస్‌ పికెట్‌
 
శిరివెళ్ల (ఆళ్లగడ్డ): మండలంలోని వనికినిదిన్నె గ్రామంలో బుధవారం రాత్రి తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. చాకలి మధుకు చెందిన జొన్న పంటలో బండి సుదర్శనం గొర్రెలు పడిన విషయంపై వివాదం చెలరేగింది. దీంతో గుంగుల, భూమా వర్గాలకు చెందిన వారు.. మిద్దెలెక్కి రాళ్లు, మందు సీసాలు రువ్వుకున్నారు. పరిస్థితి విషమించడంతో సీఐ ప్రభాకరరెడ్డి తన బలగాలతో గ్రామానికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఘర్షణలో 11 మందిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement