స్మార్ట్ సిటీల ఆవశ్యకత, వాటి నిర్మాణంలో తీసుకోవాల్సిన మెలకువలు, అభివృద్ధి చెందిన దేశాల్లో స్మార్ట్‌సిటీల పాత్ర, తదితర అంశాలపై చర్చిచేందుకు ’స్మార్ట్ సిటీస్ ఫర్ స్మార్ట్ పీపుల్’ అనే పేరుతో సంస్కృతీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కళాశాలలో జనవరి 27, 28న జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు.
జనవరి 27,28న స్మార్ట్ సిటీస్‌పై జాతీయ సదస్సు
Dec 26 2016 11:51 PM | Updated on Jun 1 2018 8:39 PM
స్మార్ట్ సిటీల ఆవశ్యకత, వాటి నిర్మాణంలో తీసుకోవాల్సిన మెలకువలు, అభివృద్ధి చెందిన దేశాల్లో స్మార్ట్‌సిటీల పాత్ర, తదితర అంశాలపై చర్చిచేందుకు ’స్మార్ట్ సిటీస్ ఫర్ స్మార్ట్ పీపుల్’ అనే పేరుతో సంస్కృతీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కళాశాలలో జనవరి 27, 28న జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు.
సోమవారం కళాశాలలో డైరెక్టర్ డాక్టర్ నారాయణరెడ్డి తో కలసి సదస్సు బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ సదస్సుకు జపాన్ కు చెందిన ప్రఖ్యాత నిర్మాణ రంగ నిపుణుడు అజీబ్రౌన్, వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన క్లోయి జిమ్మర్‌మన్, ఆస్ట్రియాకు చెందిన శ్రీపాల్ అతిథులుగా, దేశీయంగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థల నుంచి వంద మందికిపైగా ప్రతినిధులు హాజరవుతారన్నారు. వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు కూడా సదస్సుకు హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సెంథిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement