రోడ్డు ప్రమాదంలో ఆరుకి చేరిన మృతుల సంఖ్య | Road accident death toll reached six | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆరుకి చేరిన మృతుల సంఖ్య

Aug 3 2016 5:00 PM | Updated on Aug 30 2018 4:07 PM

మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.

మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో నిన్న ముగ్గురు మృతిచెందగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మృతిచెందారు. దీంతో ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.

గుంటూరు జ్లిలా బొల్లపల్లి మండలం మేళ్లవాగు సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వినుకొండ వెళ్తున్న తార్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జై డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతిచెందగా.. బచ్చమ్మ, సుభాన్‌బీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పత్తిపాటి సుకన్య(22), రామకోటమ్మ(65), రత్తమ్మ(48) వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. మృతులంతా తమిడిపాడుకు చెందిన వారుగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement